- Advertisement -
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో శుక్రవారం ఉదయం కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ఈ కాల్పులో ముగ్గురు మృతి చెందారు. పట్టపగలు న్యాయం స్థానం ఆవరణలో గ్యాంగ్‌స్టర్‌ను కాల్చివేశారు. గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగీపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులను పోలీసులు కాల్చి చంపారు. ఇద్దరు దుండగులు న్యాయవాదుల వేషధారణలో వచ్చి కాల్పులు జరిపారు. విచారణ కోసం గ్యాంగ్‌స్టర్ గోగిని రోహిణి కోర్టుకు తీసుకొస్తుండగా టిల్లు తాజ్ పూరియా గ్యాంగ్ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వ్యాపారవేత్త రూ.5 కోట్ల ఇవ్వాలని బెదిరించడంతో జితేంద్ర గోగీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
- Advertisement -