Monday, December 23, 2024

షేక్‌పేటలో కరెంట్ షాక్‌తో ముగ్గురు అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని షేక్‌పేట పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సంపు క్లీన్ చేస్తుండగా కరెంట్ షాకుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు అనాస్(19), రజాక్(18), రిజ్వాన్(16)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కరెంట్ షాక్ ఇచ్చి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News