Friday, December 20, 2024

చెరువులో జారిపడి ముగ్గురు మృతి…

- Advertisement -
- Advertisement -

Three members of same family slipped in pond and died

వరంగల్: నర్సంపేట మండలం చిన్నగురిజాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి మొత్తం ముగ్గురు ప్రాణాలు విడిచారు. తాత, మనవడు కాళ్లు కడుక్కునేందుకు చెరువులోకి దిగారు. కృష్ణమూర్తి(65), లక్కీ(12) చెరువులో మునిగిపోయారు. తన తండ్రి, కుమారుడిని కపాడేందుకు నాగరాజు (35) చెరువులోకి దిగాడు. చెరువులో మునిగి ఊపిరాడక ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్లే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News