Wednesday, April 2, 2025

జెసిబి దూసుకెళ్లి ముగ్గురు వలస కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో జెసిబి వాహనం దూసుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారు. మృతులను విష్ణు(26), శివరాం(28), బలరాం(30)గా గుర్తించారు. నీలవంజి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు.

పొలంలో బోరుబావి తవ్వేందుకు గ్రామానికి వచ్చిన బృందంలో ఈ ముగ్గురు సభ్యులని వారు చెప్పారు. డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్లే మట్టి రోడ్డులో వీరు నిద్రిస్తున్న సమయంలో వారిని గమనించకుండా జెసిబి వాహనం వారిపై నుంచి దూసుకెళ్లింది. దాని కింద నలిగి ముగ్గురు కార్మికులు మరణించినట్లు పోలీసులు చెప్పారు. దేవదుర్గ పోలీసులు సంఘటన స్థలిని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News