Monday, December 23, 2024

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Three militants killed in Baramulla encounter

బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద ఉగ్రవాదుల ఉనికి గురించి భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. “ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాను కూడా ఈ ప్రమాదకర ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఆయుధాలు,మందుగుండు సామాగ్రి సహా నేరారోపణ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు” అని ఐజిపి కాశ్మీర్ ట్వీట్ చేశారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టామని, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News