Friday, November 22, 2024

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Three militants killed in Pulwama encounter

 

ఇద్దరు బిజెపి నేత ఇంటిపై దాడిలో నిందితులు

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో ఇద్దరు గురువారం నౌగాంలోని బిజెపి నేత అన్వర్‌అహ్మద్ ఇంటిపై దాడిలో పాల్గొన్నారని కాశ్మీర్ ఐజిపి విజయ్‌కుమార్ తెలిపారు. కాకాపొరా ప్రాంతంలోని ఘాట్‌మొహల్లాలో తాజా ఎన్‌కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదులు తెల్లవారుజామున కాల్పులు ప్రారంభించడంతో ఎదరుకాల్పులకు దిగామని ఐజిపి తెలిపారు. ఉగ్రవాదులు ఐదుగురు పౌరుల్ని బందీలుగా పట్టుకొని లొంగిపోయేందుకు నిరాకరించారని ఆయన తెలిపారు. దాంతో, ఎన్‌కౌంటర్‌కు సమయం పట్టిందని తెలిపారు. బందీలను బయటకు రప్పించి ఎన్‌కౌంటర్ పూర్తి చేశామన్నారు.

ఈ సందర్భంగా ఓ మహిళ కాలికి బుల్లెట్ గాయమైందని, మరో ముగ్గురు పౌరులకు పెల్లెట్ గాయాలయ్యాయని విజయ్‌కుమార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సుహైల్ నిసార్‌లోన్, యాసిర్‌వనీ, జునైద్ అహ్మద్ అనే ఉగ్రవాదులు మృతి చెందారు. వీరంతా పుల్వామా జిల్లాకు చెందినవారు. ఎన్‌కౌంటర్ స్థలంలో ఒక ఎకె47, పిస్టల్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్టు ఐజిపి తెలిపారు. బిజెపి నేత ఇంటిపై జరిగిన దాడిలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు గుర్తించామని తెలిపారు. వీరు లష్కరే తోయిబా, అల్‌బదర్ గ్రూప్‌లకు చెందినవారని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News