Wednesday, January 22, 2025

ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు

- Advertisement -
- Advertisement -

మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో పదకొండు మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రులలో ఒకే జిల్లానుంచి ముగ్గురు మంత్రులకు అవకాశం లభించడం విశేషం. ఖమ్మం జిల్లానుంచి  భట్టి విక్రమార్కతోపాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది. వీరిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సిఎం పదవిని చేపట్టనున్నారు.

ఇక నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలనుంచి ఇద్దరేసి చొప్పున మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లభించింది. నల్గొండ జిల్లానుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లానుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధరబాబు, వరంగల్ జిల్లానుంచి సీతక్క, కొండ సురేఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News