Tuesday, January 21, 2025

మంటల్లో ముగ్గురు మైనర్ల సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో శనివారం తెల్వారుజామున ఒక ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు బాలికలతోసహా ముగ్గురు మైనర్లు సజీవదహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

వంట గ్యాసు సిలిండర్ లీకేజీ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోర్మి పోలీసు స్టేషన్ పరిధిలోని దనేకపుర గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు సీనియర్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు(ఎస్‌డిఓపి) రాజేష్ రాథోర్ తెలిపారు.

మంటల్లో కాలి చనిపోయిన వారిలో ఒక 4 సంవత్సరాల బాలుడు, అతని 10 ఏళ్ల సోదరి, 5 ఏళ్ల మరో బాలిక ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని అఖిలేష్ రాజ్‌పుత్, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారని, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గ్వాలియర్‌కు తరలించామని పోలీసులు చెప్పారు. మృతులంతా ఇంటి యజమాని అఖిలేష్‌కు మనవలని వారు చెప్పారు. అఖిలేష్ కోడలు, కుమార్తె గోర్మి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని వారు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News