Thursday, January 23, 2025

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురు గల్లంతుపై అనుమానాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురి ఆచూకీ గల్లంతుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆచూకీ లేని ముగ్గురు బిహార్ కూలీల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. దీంతో జునైద్, వసీం అక్తర్ కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు. కాలిపోయిన భవనంలోనే కూలీల సెల్ ఫోన్ సిగ్నల్ చూపిస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. ఒకవేళ ఫోన్లు లోపలే వదిలేసి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. భవనం లోపలే ఉంటే మృతదేహాలు కాలి బూడిలైన ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఆచూకీ లేని ముగ్గురి కోసం క్రేన్ సాయంతో పోలీసులు గాలిస్తున్నారు. గాలింపు తర్వాత భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాల ఆనవాల్లు కనిపిస్తే బయటకు తీస్తామని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News