Thursday, January 9, 2025

ఎముకలు కొరికే చలిలో రైల్వేట్రాక్ వద్ద పసికందు లభ్యం

- Advertisement -
- Advertisement -

రైల్వేట్రాక్ వద్ద మూడు నెలల
పసికందు లభ్యం
మన తెలంగాణ/పెద్దపల్లి ప్రతినిధి: జిల్లా కేంద్రం శివారులోని రైల్వే లైన్ సమీపంలో మూడు నెలల పసిగుడ్డును మంగళవారం కొందరు వ్యక్తులు పడేసిన విషయాన్ని స్థానికులు గుర్తించారు. చిన్నారి పాప విషయాన్ని రైల్వే సిఐ, చైల్డ్ కోఆర్డినేటర్ ఉమాదేవి, కనకరాజుకు తెలిపారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి సిబ్బంది ద్వారా పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాపకు ఎటువంటి గాయాలు లేకపోవడంతో పసికందును రైలు నుంచి కిందపడేయలేదని, పాపను స్థానికులు వదిలి వెళ్లినట్టు రైల్వే పోలీసులు  వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News