Monday, December 23, 2024

ఉత్పత్తి లక్ష సాధనలో మూడె నెలలే కీలకం

- Advertisement -
- Advertisement -

కాసిపేట: ఉత్పత్తి లక్ష సాదనలో మూడు నెలలే కీలకం అని సింగరేణి సిఅండ్‌ఎండి ఎన్. శ్రీధర్ అన్నారు. మంగళవారం విడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు దిశా నిర్దేశం చేసారు. రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి రవాణా చేయాలని ఆయన సూచించారు. 14.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని ఆయన సూచించారు.

వర్షాకాలం కావడం ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా పటిఫ్టమైన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఓసి గనుల నుండి నీటిని బయటకు తీసేందుకు భారీ పంపులు పెట్టాలని, రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు. సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 75 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్షాలను సాధించాలంటే మూడు నెలలు అతికీలకం అన్నారు. వర్షకాలం ఉపరితల గనుల్లో ఉత్పత్తి కుంటు పడకుండా చూడాలని అన్ని ఏరియాల జింఎంలకు ఆదేశాలు జారీ చేసారు.

గత ఏడాది భారీ వర్షాలు కురవడం వల్ల తైమాశికలో అతి తక్కువ బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. జూలైలో కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపద్యంలో ఉత్పత్తి సాఫఙగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఓపెన్‌కాస్టు గనుల్లో నీటి నిల్వల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా పంపులను ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు పంపాలని ఆయన సూచింఆచరు. అడ్రిమాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు నుండి రోజుకు 7 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాలన్నారు.

కొత్తగూడెం ఏరియా రోజుకు 41 వేల టన్నులు, బొగ్గు రవాణా జరపాలన్నారు. మణుగూరు ఏరియాలో 40 వేల టన్నుల, రామగుండం 2 ఏరియాలో 24 వేల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియాలో 19 వేల టన్నులు, రామగుండం 3 ఏరియాలో 14.500 టన్నులు, బెల్లంపల్లి ఏరియాలో 14 వేల టన్నులు, మందమర్రి ఏరియాలో 12 వేల టన్నులు, రామగుండం 1 ఏరియాలో 11.500 టన్నులు భూపాలపల్లి ఏరియాలో 10 వేల టన్నులు సాధించాలని ఆయన నిర్దేశించారు.

ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి లక్షం 167 లక్షల టన్నులు కాగా 171 లక్షల టన్నులు సాధించి 102 శాతంతో ముందంజలో యుందన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బలరాం, ఎన్‌వికె శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి, డిఎన్ ప్రసాద్, సురేంద్రపాండే, జె. అల్వీన్, సురేష్, కె. సూర్యనారయణ, జక్కం రమేష్, మల్లెల సుబ్బారావ్, అన్ని ఏరియాల జిఎంలు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News