Wednesday, January 22, 2025

మైనర్ గ్యాంగ్‌రేప్ కేసులో మరో ముగ్గురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

నిందితుల్లో ముగ్గురు మైనర్లు
ఐదుకు చేరిన నిందితుల సంఖ్య
14రోజుల రిమాండ్‌కు తరలింపు
ఇన్నోవా కారు స్వాధీనం
పబ్‌లో పార్టీ ఏర్పాటుపై పోలీసులు ఆరా
150మంది విద్యార్థుల హాజరైనట్లు నిర్ధారణ
పబ్‌లో పరిచయమైన యువకులతోనే బాలిక బయటకు వెళ్లినట్లు గుర్తింపు

మనతెలంగాణ, సిటిబ్యూరోః జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో శనివారం నాడు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈకేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారని, ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వివరించారు. వివరాల్లోకి వెళితే…అమ్నీషియా పబ్బులో పార్టీ కోసం గత నెల 28వ తేదీన వెళ్లిన బాలిక(17)ను ఇన్నోవా కారులో తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులలో సాధుద్దిన్ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా సాదుద్దిన్ మాలిక్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్‌కు తరలించగా జైలుకు తరలించారు. అలాగే మరో ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.

ఇన్నోవా కారు స్వాధీనం 

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సమయంలో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో బాలికపై అత్యాచారం జరిగినట్లు విచారణలో తేలడంతో పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా టిఆర్ నంబర్‌తో ఉన్న ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కారు యజమాని వివరాలు వెల్లడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులు అత్యాచారానికి వాడిని ఇన్నోవా కారును మోయినాబాద్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇన్నోవా కారు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయిందో పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పార్టీ ఏర్పాటు ఆరా….

పబ్‌లో కాలేజీ పేరిట జరిగిన పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్ ప్లస్ టూ విద్యార్థులు పబ్‌లో ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే విద్యార్థులు నిషాన్, ఆదిత్య, ఇషాన్ పేరుతో పబ్ బుక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. పబ్‌లోని పార్టీకి దాదాపుగా 150మంది విద్యార్థులు హాజరైయ్యారని, ఆ పార్టీలో విద్యార్థులకు మద్యం సరఫరా చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, కూల్ డ్రింక్‌లు మాత్రమే సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ పార్టీలో పరిచయమైన యువకులతో బాలిక పబ్ నుంచి బయటకు వెళ్లినట్లు సిసి పుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News