Wednesday, November 6, 2024

తెలుగు అకాడమీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Three more arrested in Telugu Academy case
నిందితుల నిధుల మళ్లింపుపై ఇడి ఆరా..!

హైదరాబాద్:  తెలుగు అకాడమీ ఎఫ్‌డిల కేసులో మరో ముగ్గురు అరెస్టుతెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరో ముగ్గురు భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌లను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా శనివారం నాడు ఈ కేసులోని నలుగురు నిందితులను చంచల్ గూడ జైల్ నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్‌ను కస్టడీకి తీసుకోగా, నాలుగో రోజు కూడా మస్తాన్‌వలీని కస్టడీలోకి తీసుకుని కొట్టేసిన డబ్బును ఎక్కడ దాచారన్న కోణంలో విచారించారు. తాజాగా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో సురభి వినయ్ తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అలాగే రమణారెడ్డి ఈ కేసులోని ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో భూపతికి ఎఫ్‌డిఐల నకిలీ పత్రాలతో సంబంధముందని సిసిఎస్ పోలీసులు విచారణలో తేలింది. తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య 14కు చేరుకుంది. కాగా కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.

నిధుల మళ్లింపుపై ఇడి ఆరా..!

తెలుగు అకాడమీలో రూ. 64.5 కోట్ల కుంభకోణం కేసులో నిధుల మళ్లింపుపై ఇడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులోని నిందితులు కొట్టేసిన డబ్బును నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఇడి గుర్తించింది. నిందితులు మనీలాండరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. యూబిఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయని, ఎఫ్‌డిలను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్ సొసైటీకి మళ్లించగా కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లనూ మళ్లించిన వైనంపై ఇడి విచారణ ప్రారంభించింది. అదేవిధంగా నిందితులు స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు తమ సొంతానికి వాడుకున్నారన్న అంశాలపై ఇడి వివరాలను సేకరిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో కీలక సూత్రధారి సాయికుమార్ రూ.20 కోట్లు తీసుకోగా ఎపి మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టు పత్రాలను ఇడి స్వాధీనం చేసుకుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు తెలిపిన వివరాలను ఇడి సేకరించడంతోపాటు విచారణ ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News