Friday, November 22, 2024

రాష్ట్రంలో మరో మూడు రోజలు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తిస్‌గఢ్ దాని పరిసిర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం , దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మరోక ఆవర్తనం మంగళవారం బలహీనపడ్డాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరట్వాడ ,ఉత్తర ఇంటీరియర్ కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ , చుట్టు పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 37నుండి 40డిగ్రీల మద్యలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News