Monday, December 23, 2024

గ్యాస్ లీక్ ప్రమాదంలో మరో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని దోమలగూడ రోజ్ కాలనీలో చోటు చేసుకున్న గ్యాస్ లీక్ ప్రమాదంలో శుక్రవారం మరో ముగ్గురు మరణించి నట్టు సిఐ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బోనాల మహోత్సవాల కోసం కుమార్తె, అల్లుడు, పిల్లలతో పాటు చెల్లెలు, ఆమె భర్త రోజ్‌కాలనీలో నివసించే పద్మ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పిండి వంటలు చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో గ్యాస్ స్టౌవ్ వెలిగించగా, ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగి 7గురు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

ఆ వెంటనే ప్రమాదానికి గురైన బాధితులను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స జరుగుతుండగానే బుధవారం 11 ఏళ్ల చిన్నారి శరణ్య మృతి చెందారు. ఇదిలా ఉండగా, శుక్రవారం మరో ముగ్గురు మరణించారు. వీరిలో ఇంటి యాజమానిరాలు పద్మ (53), ధనలక్ష్మీ (28), అభినవ్ (7)లు మరణించినట్టు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. దీంతో దోమలగూడ రోజ్‌కాలనీ గ్యాస్ లీక్ ఘటన లో మొత్తం 4 గురు మరణించగా, మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News