Wednesday, January 22, 2025

నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మరో ముగ్గురు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. మాజీ స్పీకర్ బిక్రమ్ కేశరి అరూఖా, రూర్కెలా ఎమ్‌ఎల్‌ఎ సరద పి నాయక్, బంగిరిపోసి ఎమ్‌ఎల్‌ఎ సుదామ్ మరాండీలతో గవర్నర్ గణేషి లాల్ సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. భువనేశ్వర్ లోని లోక్‌సేవా భవన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

ముఖ్యమంత్రి పట్నాయక్ తన హయాంలో ఈ విధంగా మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి. ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, గత జనవరిలో రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నాబా కిషోర్ దాస్ హత్యకు గురి కావడంతో తాజాగా మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి అయింది. కొత్తగా చేరిన ముగ్గురితో ముఖ్యమంత్రితోసహా ఒడిశా క్యాబినెట్‌లో మొత్తం 22 మంది మంత్రులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News