Friday, December 20, 2024

ఆజాద్‌కు మద్దతుగా మరో ముగ్గురు సీనియర్లు రాజీనామా

- Advertisement -
- Advertisement -

Three more seniors resigned in support of Azad

కతువ/జమ్మూ: ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కశ్మీరుకు చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో మాజీ డిప్యుటీ స్పీకర్ గులాం హైదర్ మాలిక్ ఉన్నారు. కతువా జిల్లాకు చెందిన బనీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన మాలిక్‌తో పాటు ఇద్దరు మాజీ ఎంఎల్‌సిలు తమ రాజీనామా లేఖలను పార్టీ అధిష్టానానికి పంపారు. ఆజాద్‌కు మద్దతుగా ఈ ముగ్గురు నాయకుల నుంచి తమకు లేఖలు అందాయని ఆజాద్ సన్నిహితుడు, మాజీ మంత్రి జిఎం సరూరి తెలిపారు. ఇలా ఉండగా&మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల మజీద్ వాని, మనోహర్ లాల్ శర్మ, ఘరూ రాం, మాజీ ఎంఎల్‌ఎ బల్వాన్ సింగ్ సోమవారం ఢిల్లీలో ఆజాద్‌ను కలసశారు. వీరు కూడా మంగళవారం ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే డజను మందికి పైగా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వందలాది మంది పంచాయత్ రాజ్ సంస్థల సభ్యులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు కాంగ్రెస్‌ను వీడి త్వరలోనే జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయనున్న ఆజాద్‌తో చేతులు కలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News