Friday, January 24, 2025

ఇంట్లో గ్యాస్ లీక్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

దోమలగూడ: హైదరాబాద్ లో మూడు రోజుల క్రితం ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగడంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. జూలై 11న దోమలగూడలోని వాల్మీకినగర్‌లో ఉన్న ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడ్డారు. పదకొండేళ్ల బి. శరణ్య జులై 12న ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

పద్మ (55), ఆమె కుమార్తె ధనలక్ష్మి (30), మనవడు అవి (7) శుక్రవారం మృతి చెందారు. శరణ్య పద్మకు మనవరాలు కూడా. పద్మ సోదరి నాగమణి (50), అల్లుడు ఆనంద్ (34), మనవడు (4) చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదమ్మ, నాగమణి స్టవ్‌ ఆన్ చేసేందుకు స్టవ్‌ వద్దకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీని వారు గమనించలేదు. వారు స్టవ్ ఆన్ చేయడంతో, లీకైన గ్యాస్ మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News