Sunday, December 22, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్‌పాల్‌దబ్బాకున్నా గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీస్‌లు, ఆర్మీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల దబ్బాకున్నా గ్రామ శివార్ల లోని కొండపై ఉన్న నక్సలైట్లును ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజ్ చెప్పారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు , మందుగుండు సామగ్రి లభ్యమైనట్టు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News