Sunday, January 19, 2025

జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

Three Naxals killed in encounter at Latehar district

రాంచీ : జార్ఖండ్‌లోని లాటేహర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది.అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల గస్తీ సమయంలో జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామునే ఈ ఘటన జరిగిందని రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల ఐజిపి అమోల్ వి హోంకార్ తెలిపారు. మానికా పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు వివరించారు. దట్టమైన అటవీ ప్రాంతంలోకి కొందరు నక్సలైట్లు పారిపొయ్యారని, తరువాత జరిపిన గాలింపులో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలు లభించాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News