Friday, November 22, 2024

సిబిఐలో ముగ్గురు కొత్త జాయింట్ డైరెక్టర్లు

- Advertisement -
- Advertisement -

Three new Joint Director appointed in CBI

 

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)లో కొత్తగా ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు నియమితులయ్యారు. సీనియర్ ఐపిఎస్ అధికారులు విద్యా జయంత్ కులకర్ణి, ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ, నవల్ బజాజ్‌లను సిబిఐ జాయింట్ డైరెక్టర్లుగా నియమించినట్లు కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం తెలిపింది. తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఐపిఎస్ అధికారి కులకర్ణిని డిప్యుటేషన్ విధానంపై ఐదేళ్ల కాలానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. ఒడిష క్యాడర్‌కు చెందిన 1999 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఉపాధ్యాయ 2026 జూన్ 29 వరకు జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1995 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన బజాజ్ 2026 జూన్ 6 వరకు ఈ పదవిలో కొనసాగుతారని సిబ్బంది శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News