Monday, December 23, 2024

హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చే సింది. కొత్త న్యాయమూర్తులుగా న్యాయవాది అనిల్ కు మార్ జూకంటి, న్యాయవాది లక్ష్మీసారాయణ అలిశెట్టి, జ్యుడీషియల్ అధికారి సుజనా కలసికం నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ముగ్గులు న్యాయమూర్తులను నియనించాలని సుప్రీం కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో అడ్వొకేట్ కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికం ఉన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ నెల 12న సమావేశమైన జస్టిస్ సంజయ్‌కిషన్‌కౌల్, జస్టిస్ సంజీవ్‌ఖన్నాలతో కూడిన కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గు రు న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్కడి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక చేసిన ఇద్దరి పేర్లను 2022 డిసెంబరు 22న ప్రతిపాదించారని పేర్కొం ది. న్యాయాధికారి కోటాలో ఎంపిక చేసిన పేరును అదే ఏడాది అక్టోబరు 23న సిఫార్సు చేయగా ఈ పేర్లకు రాష్ట్ర గవర్నర్, సిఎం కూడా ఆమోదముద్ర వేశారని కొలీజి యం వెల్లడించింది. న్యాయవాద వృత్తిలో లక్ష్మీనారాయణకు 26 ఏళ్లు, అనిల్‌కుమార్‌కు 20 ఏళ్ల అనుభవం ఉం దన్న కొలీజియం లక్ష్మీనారాయణకు ఆర్బిట్రేషన్‌లో, రి ట్, సివిల్, కమర్షియల్ లిటిగేషన్ కేసుల్లో నైపుణ్యం ఉం దని తెలిపింది. అనిల్‌కుమార్‌కు ట్యాక్సేషన్‌లో ప్రావీణ్య ం ఉండగా ఆయన సివిల్, క్రిమినల్, సర్వీస్ లా, కాన్‌స్టిట్యూషనల్ కేసులు వాదించారని కొలీజియం ప్రకటనలో వెల్లడించింది. ‘న్యాయాధికారి సుజన పేరును పరిశీలించేటప్పుడు కొందరు సీనియర్ న్యాయాధికారుల పేర్ల ను హైకోర్టు సిఫార్సు చేయలేదన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకున్నాం. ఆమెకంటే సీనియర్ల పేర్లను ఎందుకు సిఫా ర్సు చేయలేదో చెబుతూ హైకోర్టు కొలీజియం చెప్పిన కారణాలను పరిశీలించి, వాటితో ఏకీభవించాం. సుప్రీంకోర్టు లో తెలంగాణ అంశాలపై అవగాహన ఉన్న సహచర న్యా యమూర్తులు, కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాలను క్రోడీకరించాక న్యాయవాదులులక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, న్యాయాధికారి సుజన కలసికం హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి తగినవారన్న నిర్ణయానికి వచ్చి, వారి పేర్లను సిఫార్సు చేయాలని నిర్ణయించాం’ అని కొలీజియం వివరించింది. మొత్తంగా 49 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 25 మంది పని చేస్తున్నారు. వారిలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఎనిమిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News