Thursday, December 19, 2024

టిప్పర్ ఢీకొని కుటుంబం మృతి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: టిప్పర్ లారీ ఢీకొట్టడంతో భార్య, భర్త, కుమారుడు మృతిచెందిన సంఘటన గురువారం వాసవి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జరిగింది. పరిగి ప్రాంతానికి చెందిన చెందిన గోపాల్ (29), అతడి భార్య రేణుక (25), వారి కుమారుడు అర్జున్ (2) రాజేంద్రనగర్ మండలంలోని మంచిరేవుల గ్రామంలో గత కొంత కాలం నుంచి నివసిస్తున్నారు. గోపాల్ స్థానికంగా తాపీ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు అర్జున్ కాగా, రేణుక ఎనిమిది నెలల గర్భంతో ఉంది. దీంతో రేణుకను ప్రతి నెల గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళుతున్నాడు. దీనిలో భాగంగానే పరీక్షలు చేయించేందుకు గురువారం ఉదయం ముగ్గురు కలిసి బైక్‌పై ఆస్పత్రికి బయలు దేరారు. వాసవీ కాలేజీ సమీపంలోని ఇబ్రహీంబాగ్ వద్దకు రాగానే, వీరి బైక్‌ను ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది.

దీంతో టిప్పర్ వెనుక చక్రాల కింద బాలుడు అర్జున్ పడడంతో అక్కడికక్కడే మృతిచెందగా, గోపాల్, రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారికి అటువైపు వస్తున్న మధు సిపిఆర్ చేశాడు. తర్వాత 108కి ఫోన్ చేసి తీవ్రంగా గాయపడిన రేణుక, గోపాల్‌ను సమీపంలోని ఇన్నోవా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపాల్, రేణుక చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోల్కొండ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇబ్రహీంబాగ్ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్షం వల్ల తరచూ ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు రోడ్డుపై ధర్నా చేశారు. వెంటనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News