Tuesday, September 17, 2024

3 బిల్లులకు ‘సై’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపించా రు. ఇంకో రెండు బిల్లులను మాత్రం పెండింగ్‌లోనే ఉంచారు. గతేడాది సెప్టెంబరులో జరిగి న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమి ది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్ తమిళిసైకి పంపించింది. వాటిలో జిఎస్‌టి బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించా రు. తాజాగా సోమవారం మరో మూడు బిల్లులకు ఆమోదముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీ సుకున్నారని తెలిసింది. 2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలం లో 10 బిల్లులను పంపినా ఇంతవరకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని తెలంగాణ ప్ర భుత్వం గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బి ల్లును పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు బిల్లుకు ఆమోదముద్ర వేయ డం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం.. అనే నాలుగు మార్గాల్లో ఏదో ఒకదానిని మాత్రమే అనుసరించాలి. అలా చేయకుండా బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ ని బంధనల పరిధిలోకి వస్తుందా? శాసనసభ బి ల్లులు పాస్ చేసి పంపిన చాలా కాలం తర్వాత కూడా వాటిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయకుండా అలాగే ఉంచుకోవడం రాజ్యాంగబద్ధమేనా? అని పిటిషన్‌లో తెలంగాణ ప్రభు త్వం ప్రశ్నించింది. విచక్షణాధికారాన్ని ప్ర యోగించడమంటే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండడం కాదని పేర్కొంది. చట్టసభలు ఆమోదించిన బి ల్లులను ఇలా పెండింగ్‌లో పెట్టడమంటే శాసనసభ అధికారాలను రద్దుచేయడం కిందికే వ స్తుందని తెలిపింది.

సుప్రీంలో విచారణ రెండు వారాలు వాయిదా
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. వివరాలు కోర్టుకు సమర్పించారు. ఈ అంశంపై ఏప్రిల్ 9న గవర్నర్ సచివాలయం నుంచి నివేదిక అందిందని తెలిపారు. కొన్ని బిల్లులపై ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. పంచాయితీరాజ్ చట్టసవరణ బిల్లుతో పాటు అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత సవరణ బిల్లులపై వివరణ కోరామని… సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో గవర్నర్ పేర్కొన్నారు. న్యాయశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ సచివాలయం పేర్కొంది. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చుతూ తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది.

ఆ 10 బిల్లులు ఇవే

1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు
2. తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు
3. జిఎస్‌టి చట్ట సవరణ బిల్లు
4. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు
5. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు
6. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు
7. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు
8. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) (సవరణ)
9. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు
10. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News