Monday, December 23, 2024

గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Three of the same family brutally murdered in Gorakhpur

గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో ఇటీవలే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే దారుణహత్యకు గురైన సంఘటన మరువక ముందే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, అతని భార్య , కుమార్తెను దుండగులు ఆయుధాలతో గొంతుకోసి ఇంటికి కొద్ది దూరం లోనే హత్యచేశారు. పోలీసుల సమాచారం ప్రకారం రాయ్‌గంజ్ లోని బంగ్లా చౌక్ లోని వారి ఇంటికి 800 మీటర్ల దూరంలో ఈ హత్యలు చోటుచేసుకున్నాయి. మృతులు గమ నిషద్ (42), అతని భార్య సంజు నిషద్ (38). కుమార్తె ప్రీతి (20)గా గుర్తించారు. ఈ కేసులో అలోక్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం కావడంతో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రీతిని నిందితుడు అలోక్ ప్రేమిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హత్యల్లో నిందితులు ఒక పారను ఆయుధంగా ఉపయోగించారని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News