Monday, January 20, 2025

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం ..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అనంతనాగ్ జిల్లా కోకర్‌నాగర్ ప్రాంతంలో బుధవారం ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, జమ్ముకశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్‌భట్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. డీఎస్పీ హుమయూన్‌భట్ తీవ్ర గాయాలతో అధికంగా రక్తస్రావం కావడంతో తుదిశ్వాస విడిచారు. అలాగే జవాన్ రవి కూడా ప్రాణాలు విడిచారు. అదే సమయంలో భద్రతా బలగాలు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే అనంత్‌నాగ్ జిల్లా రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ సమయంలో ఎదురెదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News