Monday, January 20, 2025

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూ తెహ్రీ : ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా చంబా వద్ద సోమవారం భారీ కొండచరియ విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి ఉన్నారు. కొండచరియ శిధిలాల కింద ఇరుక్కున్న కారులో వారి మృతదేహాలను కనుగొన్నామని, మరికొన్ని వాహనాలు ఆ శిధిలాల్లో ఇరుక్కున్నాయని తెహ్రీ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సింగ్ భుల్లార్ వెల్లడించారు. మృతదేహాల కోసం శిధిలాలను గాలిస్తున్నామని తెలిపారు. మృతులు పూనం ఖండూరి, ఆమె నాలుగు నెలల చిన్నారి కొడుకు, ఆమె వదిన సరస్వతీదేవిగా గుర్తించారు. ఈ కొండచరియ వల్ల న్యూతెహ్రీ చంబా మోటార్ రోడ్దు దిగ్బంధం అయిందని చెప్పారు. మరికొందరి కోసం ఎక్స్‌కెవేటర్‌యంత్రాలను రంగంలో ప్రవేశ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News