Monday, January 20, 2025

గ్రూప్ 3లో మూడు పేపర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 3లో మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. గ్రూప్ 3 ఉద్యోగాలకు విద్యార్హతలు, వయో పరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్‌ను టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, పేపర్ 3లో ఎకానమీ అండ్ డవలప్‌మెంట్ సబ్జెక్టులు ఉంటాయి. రాష్ట్రంలో 1,363 గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు 2022 డిసెంబర్లో టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేయగా, దరఖాస్తుల పక్రియ ఈ నెల 24 నుంచే మొదలైంది.

వీటిలో అత్యధిక ఉద్యోగాలు ఆర్థికశాఖలో ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టిఎస్‌పిఎస్‌సి పేర్కొంది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లో అనేది అధికారులు స్పష్టం చేయలేదు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణితో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని కమిషన్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News