Tuesday, November 5, 2024

ఉపపోరులో ముచ్చటగా ముక్కోణమా.!

- Advertisement -
- Advertisement -

నామపత్రాల ఉపసంహరణలతో వేడెక్కిన ప్రచారం
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో మరింత ఉత్సాహం
వరుస సెలవుల అనంతరం ఊపందుకున్న ఉప రణరంగం
నాగార్జునసాగర్ ఉపపోరులో సై అంటూ సమరోత్సాహం

Three parties contest in Nagarjuna sagar by elections

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోరులో ముక్కోణపు సమ రం తధ్యమనిపిస్తుందని పరిశీలకలు భావిస్తున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది నోముల భగత్‌కు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కు ందూరు జానారెడ్డిల మధ్య నువ్వా నేనా అనేరీతిలో ఎన్నికల పోరు కొనసాగనుండగా మరో జాతీయ పా ర్టీ అయినా భారతీయ జనతా పార్టీ అభ్యర్ది రవినాయ క్ సైతం గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచార ప ర్వం నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం మరింతగా ఊపందుకోగా గడిచిన రెండు, మూడు రోజులు గా వరుస సెలవుల అనంతరం, అదే విధంగా జిల్లా లో చోటుచేసుకున్న ఇద్దరు అధికారి తెలంగాణ రాష్ట్ర సమితి సర్పంచ్‌ల దుర్మరణాలు వెరసి స్థబ్దత నెలకొం ది. ఈ క్రమంలో అక్కడక్కడ ప్రచారాలు ముమ్మరం గా కొనసాగగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ను వ్వా నేనా అన్న రీతిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న నాగార్జునసాగర్ ఉపపోరు రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షా పార్టీలకు సంబందించి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల రణరంగంలోకి దిగడంతో మరింతగా ఉత్కంఠత రేపుతోంది.

అధికార పార్టీలో ఆమాత్యుల అండదండలు..

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చాలాకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా క్షే త్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం గా కొనసాగిస్తుంది. నామినేషన్‌ల తిరస్కరణలు, ఉపసంహరణల ప్ర క్రియ యావత్తు ముగియకుండానే అధికార పార్టీ ఎంపి, ఎమ్మెల్యేలు మండలాల వారిగా పర్యటిస్తూ బాధ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారాన్ని ఓటర్ల గడగడపకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే ఇంటి ంటి ప్రచారాన్ని అన్ని స్థాయిల్లో ముగించిన అధికార పార్టీ శ్రేణులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఒక్కొక్క గ్రామాన్ని పలుమార్లు చుట్టుముట్టారని సమాచారం. ఉప ఎన్నికల బాధ్యులుగా జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు తలసా ని శ్రీనివాస్‌యాదవ్ కారు పార్టీ అభ్యర్ది నోముల భగత్‌కు సామాజిక వర్గం వారిగా వెన్నుదన్నగా నిలుస్తున్నారు. అధికార పార్టీ అధిష్టానం అదేశానుసారం మండల బాధ్యులుగా ఉన్న ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో అనుక్షణం అనుబందాన్ని కొనసాగిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొ ండ జిల్లాలోని అ ధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పా టు ఇతర జిల్లాల శాసనసభ్యులు, శాసనమండలి స భ్యులు పెద్ద ఎత్తున సా గర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగస్వామలయ్యారు.
త్వరలో సిఎం కెసిఆర్,

యువనేత కెటిఆర్‌ల సభలు…

ఉప ఎన్నికల పర్వం విజయవంతంగా కొనసాగుతూ మరింత ఊపందుకుంటున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్ అభ్యర్ది నోముల భగత్ గెలుపును కాంక్షిస్తూ త్వరలో నే గులాబి దళపతి, సిఎం కెసిఆర్‌తో పాటు యువనే త, ఐటి మంత్రి కెటిఆర్‌ల సభలు వేర్వేరుగా ప్రణాళికాబద్దంగా సభలు, సమావేశాలు ఉండనున్నాయన్న ప్రచారంలో నియోజకవర్గంలో కారు పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయని దీంతో అధికార పార్టీ ప్రచార పర్వం మ రింత జోరుగా కొనసాగనుంది. ఇక ప్రధానంగా నా గార్జునసాగర్ ఉప ఎన్నికల పర్వంలో కులాల కు మ్ములాటలు సైతం అధికమవుతున్నాయని పరిశీలకు లు భావిస్తున్నాయి. పార్టీ అభ్యర్ధులుగా నియమితులై న నాటి నుంచి ఆయా అభ్యర్ధులకు సంబందించిన కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గా న్ని చుట్టుముడుతూ కులపెద్దలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ గంపగుత్త ఓట్లు సాధించే ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఏదిఏమైనా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు , అభ్యర్ధులు ఎన్నికల ప్రచారంతో పాటు ఓటర్ల మనస్సు గెలిచేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికబద్దమైన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News