Monday, December 23, 2024

బార్ పై కప్పు కూలి ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బార్ పై కప్పు కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద పడి మృతి చెందారు. చెన్నైలోని అల్వార్‌పేట్ ప్రాంతంలోని చామెయిర్ రోడ్డులో ఉన్న సెక్మెత్ బార్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. పై అంతస్తు పై కప్పు కూలిందని ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. అయితే దీనికి విరుద్ధమైన వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ బార్ ఎదురుగానే మెట్రో రైలు నిర్మాణ పనుల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కొందరు తెలిపారు.

కాగా చనిపోయిన వారిని కార్మికులుగా గుర్తించారని తమిళనాడు రాష్ట్ర సహాయదళ అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుపడ్డారా? అనేది తెలుసుకుంటున్నామని వివరించారు. బార్ తెరిచి ఉన్నప్పుడే దుర్ఘటన జరిగింది. మెట్రో రైలు మార్గం నిర్మాణ పనుల తాకిడి వల్లనే పై కప్పు కూలిందా? అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతనే అధికారిక ప్రకటనవెలువడుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News