Tuesday, December 24, 2024

కలుషిత ఆహారం తిని ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ పెద్దపల్లి ప్రతినిధి: కలుషిత ఆహారం తిని ఒరిస్సాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మండలంలోని గౌరెడ్డిపేట గ్రామ ఎంఎస్‌ఆర్ ఇటుక బట్టీల్లో శనివారం చోటుచేసుకుంది. వివ రాల్లోకి వెళ్లితే… రోజూ ఇటుక బట్టీలలో పనిచేసే కూలీలకు యజమాని ఆహారా న్ని అందిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా యజమాని కూలీలకు ఆహారాన్ని అందించాడు. ఆ ఆహారాన్ని తిన్న 19 మంది కార్మికులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. వీరిలో పలువురు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించా రు. వీరిలో చంద్రశేఖర భారీహా, లలితా మాజీతోపాటు మరో కార్మికుడు మృతి చెందారు. అంతేకాకుండా కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరో 13 మంది కార్మికులు చికిత్స పొందుతుండగా వారిలో నలుగురి పరిస్థితి ఆందోళ నకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బట్టి యజమాని నిర్లక్షం వల్లే కా ర్మికులు మృతి చెందారని బట్టి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్‌ఐ వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News