- Advertisement -
సుద్దేపల్లి: ఖమ్మం నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. నిన్న పాలేరు ఏటిలో దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు, సహాయ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. చేపలవేటకు వెళ్లి పాలేరు ఏటిలో యువకుడు గల్లంతయ్యాడు. యువకుడిని రక్షించేందుకు ఇద్దరు గజఈతగాళ్లు వెళ్లారు. మృతులను రంజిత్, వెంకటేశ్వర్లు, ప్రదీప్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -