- Advertisement -
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్ బర్గ్ లో తయారీ కర్మాగారంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. తుపాకీతో కొలంబియా మెషీన్ ఐఎన్ సి లోపలికి వెళ్లి దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడికి గాయాలయ్యాయి. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -