ఫరూఖ్‌నగర్: నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ముగ్గురి ప్రాణాలు బలైన ఘటన షాద్‌నగర్ పట్టణ పరిధిలోని అనూస్ కూడలిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణ సిఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన అశోక్, శంకర్, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రవిలు బొలేరో వాహనంలో మేకలను హైదరాబాద్‌లో అమ్మకాని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన జీవాలను మార్కెట్‌లో విక్రయించి అనూస్ కూడలి రోడ్డు లోంచి శనివారం తెల్లవారు జామున స్వగ్రామాలకు పయనమయ్యారు. బోలేరో వాహనం డ్రైవర్ అశోక్ (28) అశోక్ అతి వేగంగా జాతీయ రహదారిలో నిర్లక్ష్యంగా వాహనాన్ని రాంగ్ రూట్‌లో నడపడంతో, అనూస్ పరిశ్రమ కూడలి వద్ద హైదరాబాద్ వైపు వస్తున్న లారిని వేగంగా ఢికొట్టింది.
దీంతో బొలేరో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా వాహనంలో ఉన్న శంకర్ (30), రవి(25)లు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ శంకర్, రవిలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా రవి మృతి చెందాడు. శంకర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. అశోక్, శంకర్‌లు వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మందాపూర్, తెల్లరాళ్లపల్లి తండాలకు చెందినవారుగా, రవి నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నార్యానాయక్‌తండా వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి