Friday, December 20, 2024

ప్రాణం తీసిన సెల్ఫీ ఉత్సాహం..

- Advertisement -
- Advertisement -

వర్గల్ : సామల చెరువులో ముగ్గురు నీట మునిగి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు , పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి . హైదరాబాద్ పాతబస్తీ యాకూత్ పురాకు చెందిన షేక్ కైసర్ ( 26 ) , సోహెల్ ( 17 ) , షేక్ ముస్తఫా ( 3 )లు తమ కుటుంబ సభ్యులతో కలిసి దుద్దెడ వద్ద గురువారం సాయంత్రం జరగనున్న శుభకార్యానికి వెళ్లే క్రమంలోమార్గ మధ్యంలో ఉన్న బంధువు మక్త మాసన్ పల్లిలోని మహమ్మద్ గౌసోద్దీన్ ఇంటికి వారు వచ్చారు.

Also Read: మే 6వ తేదీ వరకు టిఎస్‌ ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు

మధ్యాహ్నం సమయంలో సామల పల్లి శివారులోని సామల చెరువు వద్దకు వారు వచ్చి సెల్ఫీ ఫొటోలు దిగుతుండగా , ప్రమాదవశాత్తు చిన్నారి షేక్ ముస్తఫా జారి పడ్డాడు . చిన్నారిని కాపాడేందుకు మహమ్మద్ సోహెల్ , షేక్ కైసర్ లు సైతం నీటిలో దూకడంతో వారికి ఈత రాకపోవడంతో ముత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా , బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అరుణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా , కుటుంబ సభ్యుల రోదనలు అక్కడికి చేరిన వారిని కంట తడి పెట్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News