Wednesday, January 22, 2025

వడగండ్లు.. కడగండ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వాతావర ణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలపై మేఘాలు గర్జించాయి. ప లు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రమాదాల్లో పిడుగు పాటుకు మొత్తం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో తె లంగాణ రాష్ట్రంలో గొర్రెలకాపలా కొసం వెళ్లిన ఇద్దరు యువకులతోపాటు ఒక మహిళ మృతి చెందింది. ఏపిలోని పిడుగు రాళ్ల సమీపాన మరో వ్యక్తి మృతి చెందాడు. మేత వెళ్లిన గొర్రెలు, మేకలు ఉరుములు..మెరుపు లు పిడుగులు.. వానల ప్రభావంతో ఆరుబయలు పొలాల్లోనే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.

వేసవి శగల నుంచి శీతల గాలులతో రాష్ట్రం చల్లబడింది. గురువా రం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో మేఘాలు గర్జించాయి. పలు జి ల్లాల్లో వడగండ్ల వర్షం దంచి కొట్టింది. యా సంగిలో సాగు చేసిన పలు పైర్లకు నష్టం వాటిల్లింది. ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయి. కాపుమీద ఉన్న మామిడికాయలు వడగండ్ల ధాటికి కొమ్మలతో సహా విరిగి నేల రాలాయి. ఉల్లిపం ట దెబ్బతింది. ఆరుబయట కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యపు కుప్పలు నీటమునిగాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన వేరుశెనగ పంట కుప్పలను వర్షపునీరు ముంచెత్తింది. పల్లికాయలు వర్షపు నీటిలో కలిసి తెట్టు లా తేలియాడుతూ రైతుల కళ్లముందే కొట్టుకుపోయా యి. బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతాలనుండి గంగా పశ్చిమ పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా, ఆంధప్రదేశ్ వరకూ సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది.

ఇంకోవైపు మరో ద్రోణి దక్షిణ తమిళనాడు నుండి మధ్య ,అతర్గత కర్ణాటక, గోవా ప్రాంతాల మీదుగా ఉత్తర కొంకణ్ వరకూ సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడింది. వీటి ప్రభాతంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఆకాశం మే ఘావృతంగా మారిపోయింది. తెలంగాణ సెంట్రల్ జోన్ పరిధిలో వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశా యి. వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వర్షం భీభత్సం సృష్టించింది. ఈ జిల్లాలో దాదాపు 13 గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్ల రూపంలో ఆకాశం నుంచి జలజల రాలిపడ్డ మంచు గుళ్లు పంటపొలాలను కప్పేశాయి.

ఈ దృశ్యాలు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు వర్షాలను తలపించాయి.మల్చింగ్ షీట్లు పరిచినట్టుగా కూరగాయలు , అకు కూర పంటల్లో వడగళ్లు పొలమంతటా పైర్లను కప్పేశాయి . కోత దశకు వచ్చిన వరిపైరు ఆకాల వర్షంతో నేలకొరిగింది. మొక్కజొన్న, జొన్న పైర్లకు నష్టం వాటిల్లింది. ఆరుబయట పెట్టిన కార్లుపై వడగళ్లు బుల్లెట్లలా దూసుకుపోయి అద్దాలకు తూట్లు పెట్టాయి.
రాజేంద్రనగర్‌లో 43మి.మి వర్షం
రాష్ట్రంలో గురువారం కురిసిన ఆకాల వర్షానికి పలు ప్రాంతాలు తడిసి మద్దయ్యాయి. అత్యధికంగా రాజేంద్ర నగర్ మండలంలోని మల్లార్‌దేవ్‌పల్లి, శివారంపల్లి ప్రాం తాల్లో 43 మి.మి వర్షం కురిసింది. బండ్లగూడలో 27.5, ఉప్పల్‌లో 26.8, బహదూర్‌పురాలో 23.3, చార్మినార్ ప్రాంతంలో 14.5, ఆసిఫాఫ్‌నగర్‌లో 13.8, సరూర్‌నగర్‌లో 13, హతయ్‌నగర్‌లో 11.5మిల్లి మీటర్ల వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలలో కూడా ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి.
తెలంగాణకు ఎల్లో ఆలర్ట్ హెచ్చరికలు
రానున్న 5రోజులపాటు తెలంగాణ రాష్ట్రానికి వావారణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, నల్గొండ, మ హబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యా దాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మ ల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 40కి.మి వేగంతో గా లులు, పలు చొట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెల 18 న జిగిత్యాల, రాజన్న సిరిసిల, జయశకంర్ భూపాలప ల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్‌కర్నూలు, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19న రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పిగుడుపాటుకు జాగ్రత్త
ఉపరితల ఆవర్తనాలు.. అకాల వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికాలు జారీ చేశారు. వ్యవసాయపనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గురువారం నాడు పిడుగుపాట్ల వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని లింగసానిపల్లిలో మేకల బాలకృష్ణ(22) అనే గొర్రెలకాపరి మృతి చెందనట్టు అధికారులు తెలిపారు.

పెబ్బేరులో వంగూరు లక్ష్మి(38)అనె గొర్రెల కాపరి, గట్టు మండలంలో చాకలి జమ్మన్న (38) అనే రైతు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. బల్మూరు వద్ద పిగుగుపాటుకు కాడేద్దులు ప్రాణాలు విడిచాయి. ఏపిలో మాచర్ల మండలం పరిధిలో పిడుగు పాటుక ఒక వ్యక్తి మృతి చెందగా, వందల సంఖ్యలో గొర్రెలు ప్రాణాలు విడిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News