- Advertisement -
ములుగు: జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. గోవారిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతైన సంఘటన ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివారం చోటుచేసుకుంది. మునిగిన వారిలో బాలుడితో పాటు ఇద్దరు యువకులు ఉన్నట్టు సమాచారం. ఉగాది పండగను పురస్కరించుకుని గ్రామస్థులు, యువకులు గ్రామ దేవతను గంగ స్నానానికి తీసుకెళ్లారు. గంగ స్నానం చేయిస్తున్న సమయంలో ఈతకు దిగి యువకులు సతీశ్(17),సాయివర్ధన్(17), సందీప్(12),మిస్ అయ్యారు. సమాచారం అందుకున్న జాలర్లు యువకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -