Wednesday, January 22, 2025

గజ్వేల్‌లో ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -
  • శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
  • సిపి శ్వేత హెచ్చరిక

గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పిడిచేడు రోడ్డులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఒక వర్గానికి చెందిన సంగాపూర్ యువకునితో పాటు దాడికి పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరినిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిపి శ్వేత తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్గ వైశమ్యాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు సిపి చెప్పారు. శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేసిన నిందితున్ని, సందీప్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డ మరో ఇద్దరు నిందితలను 12 గంటల లోపు అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ సంఘటనల్లో మొత్తం ఐదు కేసులు నమోదు చేశామని సిపి తెలిపారు.

ఈ కేసులో ఉన్న మిగితా నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని, ఇంకా కేసుల విచారణ కొనసాగుతుందని ఆమె వివరించారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలిస్తున్నట్లు సిపి తెలిపారు. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిపి శ్వేత స్పష్టం చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడయాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని కానీ ఇతరత్రా ఎలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని, ప్రజలు సమన్వయంతో శాంతి యుతంగా ఉండాలన్నారు. శాంతి భద్రలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆమె హెచ్చరించారు. బాధ్యత గల పౌరులుగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించటంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ప్రజలకు సిపి శ్వేత పిలుపునిచ్చారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మంగళవారం సాయంత్రానికి పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా మారిందన్నానరు. ఈ సమావేశంలో గజ్వేల్ ఎసిపి రమేష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News