Thursday, December 26, 2024

డీజిల్ దొంగతనానికి యత్నించిన ముగ్గురి బైండోవర్

- Advertisement -
- Advertisement -

జన్నారం : జన్నారం మండలం సింగరాయిపేట జియో టవర్ డీజిల్ దొంగతనానికి యత్నించి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ముగ్గురిని గురువారం స్థానిక ఎంఆర్‌వో ఇత్యాల కిషన్ వద్ద బైండోవర్ చేసినట్లు స్థానిక ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. దొంగతనానికి యత్నించిన కొమ్ముకుమార్, పాలగాని అరవింద్, ఎంసాని సంతోష్‌లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

గత నెల 27న జియో టెక్నిషియన్ పంచర్ల తిరుపతి ఇచ్చిన పిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై 89/223 కింద కేసు నమోదు చేయడం జరిగిందని, అనంతరం ఎంఆర్‌వో ఇత్యాల కిషన్ ముందు హాజరుపర్చడం జరిగిందని, ఆ నిందితులను మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి ఆరు నెలల కాలానికి రూ. 1 లక్ష జరిమానా వేస్తూ తహసిల్దార్ బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై సతీష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News