Wednesday, January 22, 2025

అగ్నిపథ్‌పై ముందు మా వాదన వినండి

- Advertisement -
- Advertisement -

Three petitions filed in SC against Agneepath scheme

‘సుప్రీం’ కు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అగ్నిపథ్ పథకంపై మూడు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు వినాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఇప్పటివరకు దాఖలైన మూడు పిటిషన్లలో దేనికి సంబంధించి కేంద్రం కేవియట్ దాఖలు చేసిందో వెల్లడించలేదు. అడ్వకేట్ హరీష్ అజయ్‌సింగ్ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. హర్ష్ అజయ్ సింగ్ సోమవారం దాఖలు చేసిన తన పిటిషన్‌లో మిలిటరీ వ్యవహారాలు, రక్షణ మంత్రిత్వశాఖకు సమాచారం అందించడానికి, రిటైర్డు మిలిటరీ ఆఫీసర్లతో సహా సూచనలు ఆహ్వానించడానికి, రిటైర్‌మెంట్ అయిన తరువాత 75 శాతం అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించడానికి పథకం సవరించడానికి, వీలుగా చట్టపరమైన కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే పథకంపై అంతకు ముందు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఇటీవల అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వందల ఏళ్ల నుంచి ఉన్న ఎంపిక విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. దీంతోపాటు ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ అనుమతి లేదని పేర్కొన్నారు. రైల్వేస్ తదితర ప్రభుత్వ ఆస్తులకు నష్టం సంభవించడం, హింసాత్మక సంఘటనలు వీటన్నిటిపై దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ( సిట్ ) ఏర్పాటు చేయాలని ఒక పిటిషన్ దారుడు కోరారు. హింసాత్మక ఆందోళనలపై ప్రస్తుత యథాతధ స్థితిని వివరిస్తూ నివేదికలు సమర్పించాలని కేంద్రానికి, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్‌దారుడు కోరారు. ఈ స్కీమ్ పరిశీలనకు , జాతీయ భద్రత, ఆర్మీలపై దీని ప్రభావం పరిశీలించడానికి రిటైర్డు సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మరో పిటిషన్‌లో కోరారు. ఈ పథకంపై జూన్ 14న విడుదలైన నోటిఫికేషన్, రద్దు చేయాలని పిటిషన్ దారుడు న్యాయవాది విశాల్ తివారీ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News