Sunday, January 5, 2025

కొండచరియలు విరిగిపడి ముగ్గురు యాత్రికులు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి ముగ్గురు యాత్రికులు మృతి చెందిన ఘటన ఆదివారం కేదార్ నాధ్ లో చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్-కేదర్ నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో చిర్బాసా ప్రాంతం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ  ఘటనలో ముగ్గురు యాత్రికులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న రిస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News