గుణ ( మధ్యప్రదేశ్ ): మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో కృష్ణజింక వేటగాళ్లను పట్టుకోడానికి అడవుల్లోకి వెళ్లిన పోలీసులపై వేటగాళ్లు కాల్పులకు పాల్పడడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. అరోన్ సమీప అటవీ ప్రాంతంలో కృష్ణ జింకలను వేటాడేందుకు కొందరు దుండగులు విడిది ఏర్పాటు చేసుకున్నట్టు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మినా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్ బృందం గుణ అడవుల్లోకి వెళ్లగా వేటగాళ్లు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. డ్రైవర్ గాయపడ్డాడు. వెంటనే పోలీసులు వేటగాళ్లపై కాల్పులు జరిపినప్పటికీ నిందితులు తప్పించుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి సరోత్తం మిశ్రా పోలీస్ సిబ్బంది మృతికి సంతాపం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యవసర సమావేశం నిర్వహించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు.