Saturday, September 21, 2024

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా

- Advertisement -
- Advertisement -

Uddhav thackeray

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కలవర పెడుతోంది. ముంబయి నగరం దాదాపుగా కరోనా కాటుకు బలి పశువుగా మారింది. ఒక్క ముంబయిలో కరోనా బాధితుల సంఖ్య 7812కు చేరుకుంది. పుణే, థానేలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. పుణే, థానేలో కరోనా రోగులు సంఖ్య వెయ్యి దాటింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా రావడం కలకలం సృష్టించింది. మాతో శ్రీ నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకడంతో ముగ్గురుని ఆస్పత్రికి తరలించారు. ఆ పోలీసుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కానిస్టేబుళ్లు నివాసముంటున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11506 మందికి కరోనా వైరస్ సోకగా 296 మంది మృతి చెందారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 37,336 మందికి సోకగా 1226 మంది చనిపోయారు. కరోనా నుంచి ప్రస్తుతం 10060 మంది కోలుకున్నారు.

Three positive cases in Maharashtra CM Securityక

రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు:

రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
11,506 9,142 1,879 485
గుజరాత్
4,721 3,749 736 236
ఢిల్లీ 3,738 2,510 1,167 61
మధ్య ప్రదేశ్
2,715 2,046 524 145
రాజస్థాన్ 2,678 1,488 1,116 62
తమిళనాడు
2,526 1,186 1,312 28
ఉత్తర ప్రదేశ్
2,328 1,632 654 42
ఆంధ్రప్రదేశ్ 1,525 1,027 441 33
తెలంగాణ
1,044 552 464 28
పశ్చిమ బెంగాల్ 795 623 139 33
జమ్ము కశ్మీర్
639 384 247 8
కర్నాటక
589 315 251 22
పంజాబ్ 585 457 108 20
కేరళ 498 102 392 4
బిహార్ 466 365 98 3
హర్యానా
357 112 241 4
ఒడిశా 154 98 55 1
ఝార్ఖండ్
113 89 21 3
ఛండీగఢ్
88 70 18
ఉత్తరాఖండ్
57 19 37 1
అస్సాం 43 9 33 1
ఛత్తీస్ గఢ్ 43 7 36
హిమాచల్ ప్రదేశ్ 40 5 30 2
అండమాన్ నికోబార్ దీవులు 33 17 16
లడఖ్ 22 5 17
మేఘాలయ
12 1 10 1
పుదుచ్చేరీ
8 3 5
గోవా 7 7
మణిపూర్
2 2
త్రిపుర 2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరాం
1 1
మొత్తం
37,336 26,046 10,060 1,226
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News