స్టాక్‌హోం: స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించనున్నారు. భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. ఫోటాన్లలో చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన ప్రయోగాలకు గాను అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లాజర్ , ఆంటోన్ జైలింగర్‌లకు ప్రపంచంలోనే అత్యత్తున పురస్కారం లభించింది. ఈ ముగ్గురు గ్రహీతలు క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలు నిర్వహించారు. రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సమాచారం ఆధారంగా సరికొత్త సాంకేతికతకు మార్గాన్ని క్లియర్ చేశాయి. భౌతిక శాస్త్రంలో గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి దక్కడం గమనార్హం. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను సుకురో మనాబే, క్లాస్ హలిస్‌మన్, జార్జియో పారిసీలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. కాగా, జార్జియో పారసీకి సగం పురస్కారాన్ని అందించగా, మిగతా సగాన్ని మనాబే, హలిస్‌మన్‌లు పంచుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. వైద్యశాస్తంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం లభించింది. ఇదిలావుండగా రేపు(బుధవారం) రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, శుక్రవారం ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు.
భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -