Tuesday, April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఐఇడి పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బిజాపూర్ జిల్లాల్లో శుక్రవారం నక్సలైట్లు ఐఇడి పేలుళ్లకు పాల్పడగా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన ఇద్దరు సిబ్బంది నారాయణ్‌పూర్ జిల్లాలో విస్ఫోటంలో గాయపడినట్లు, పోలీస్ శాఖ జిల్లా రిజర్వ్ దళం (డిఆర్‌జి) జవాన్ ఒకరికి బిజాపూర్ పేలుడులో గాయాలు తగిలినట్లు పోలీసులు వివరించారు.

ఐటిబిపి 53వ బెటాలియన్ బృందం కొహ్‌కమెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతుల్ గ్రామం సమీపంలో గాలింపు సాగిస్తుండగా శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటలకు ఐఇడి పేలుడుకు గురైనట్లు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు, వారికి ప్రాణాపాయం తప్పినట్లు ఒక అధికారి తెలియజేశారు. బిజాపూర్ జిల్లాలో ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందెపారా గ్రామం సమీపంలో ఐఇడి పేలి డిఆర్‌జి జవాను లచ్చు కడ్తి గాయపడినట్లు మరొక అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపు సాగుతోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News