Friday, November 22, 2024

ముగ్గురు అమెరికన్లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్

- Advertisement -
- Advertisement -

Nobel prize for economics

స్టాక్‌హోం(స్వీడెన్): అమెరికాకు చెందిన ఆర్థికశాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి. ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.  కారణం, ప్రభావం అనే సహజ ప్రయోగంపై పరిశోధన (రీసెర్చ్ ఆన్ ’నేచురల్ ఎక్స్ పరిమెంట్‘ టు స్టడీ కాజ్ అండ్ ఎఫెక్ట్) చేసినందుకుగాను వారికి ఈ బహుమతిని ప్రకటించారు. అయితే బహుమతి మొత్తంలో సగం డేవిడ్ కార్డ్‌కు ఇవ్వగా, మిగతా సగాన్ని జాషువా, గైడోలకు పంచారు. బహుమతి కింద బంగారు పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రౌనర్లు ఇస్తారు.

‘సమాజానికి సంబంధించిన ప్రధాన ప్రశ్నలపై డేవిడ్ కార్డ్ అధ్యయనం చేశాడు. కాగా ఆంగ్రిస్ట్, ఇంబెన్స్ ‘మెథడాలజికల్ కంట్రిబ్యూషన్స్‌పై పరిశోధనలు చేశారు’ అని ఎకనామిక్ సైన్సెస్ కమిటీ అధ్యక్షుడు పీటర్ ఫ్రెడ్రిక్సన్ తెలిపారు. ‘సమాజానికి ప్రయోజనం కలిగించే కొన్ని మామూలు ప్రశ్నలకు వారి పరిశోధన తగిన సమాధానాలు ఇవ్వగలిగింది’ అని కూడా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News