Sunday, December 22, 2024

నన్ను అంతమొందించేందుకు ముగ్గురు షూటర్లు యత్నించారు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : వజీరాబాద్‌లో తనను అంతమొందించేందుకు ముగ్గురు షూటర్లు యత్నించారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ నెలారంభంలో పాకిస్థాన్‌లో ఓ ర్యాలీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ గాయపడ్డారు. తిరిగి కోలుకున్న తరువాత ఇమ్రాన్ ఆదివారం సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న గారిసన్ సిటీలో ఓ భారీ బహిరంగ సభలో ఇమ్రాన్ శనివారం అర్థరాత్రి ప్రసంగించారు.

తనను అంతమొందించేందుకు పూర్తి స్థాయిలో యత్నించారని, కాల్పుల్లో ఆరితేరిన ముగ్గురు హత్యకు విఫలయత్నం చేశారని తెలిపారు. కంటైనర్ దగ్గరి నుంచి ఈ ముగ్గురు వేర్వేరుగా కాల్పులకు దిగారని వివరించారు. కాల్పులు చాలా పకడ్బందీగా సాగాయని, తనపై కాల్పులకు దిగిన వాడిని తుదముట్టించేందుకు ఓ షూటర్‌ను సిద్ధం చేసి ఉంచారని , అయితే ఈ వ్యక్తి జరిపిన కాల్పుల్లో పిటిఐ కార్యకర్త మృతి చెందాడని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News