Thursday, January 23, 2025

ఎపిలో ముగ్గురి విద్యార్థుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Three SSC Students Commit Suicide in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పదవతరగతి పరీక్షలు ఫెయిల్ కావడంతో శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో ముగ్గురు విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన నాగమ్మ, హనుమంతు దంపతుల కుమార్తె వెన్నెల(15) పదో తరగతి ఫెయిలైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెన్నెల ఇంట్లో ఉరేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే, అనంతపురం జిల్లా పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన విద్యార్థిని శిరీష(15) సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆమె ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో విషపు గులికలు మింగింది. ఈక్రమంలో బాత్‌రూంలో వాంతులు చేసుకుంటున్న శిరీషను కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం కుటాగులపల్లెకు చెందిన కుటాగులపల్లె నాగరాజు, వెంకటలక్ష్మమ్మల కుమారుడు ప్రశాంత్‌కుమార్ పదో తరగతి పరీక్షలలో గణితం, సోషల్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ప్రశాంత్‌కుమార్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Three SSC Students Commit Suicide in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News