Sunday, December 22, 2024

విషాదం.. మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో ఘెర ప్రమాదం జరిగింది. మీరట్‌లోని జకీర్ కాలనీలో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల క్రింద చిక్కుకున్న14 మందిని శిథిలాల నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని.. 9 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయినంట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు, స్నిఫర్ డాగ్‌ల సహాయంతో వర్షం కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చిందుకు శ్రమిస్తున్నారు.

కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే 17 మంది మరణించినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున అర్థిక సాయం అందించారు. ఇప్పటివరకు వరదల కారణంగా మొత్తం 3,056 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News