- Advertisement -
భివండి: మహారాష్ట్రలోని భివండిలో శనివారం మధ్యాహ్నం ఒక మూడంతస్తుల భవనం కూలిపోయి శిథిలాల కింద 10 మంది వరకు చిక్కుకుపోయారు. వాల్పడ ప్రాంతంలోని వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. భివండి నిజాంపురా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు, అగ్నిమాపక దళానికి చెందిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.
Also Read: భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడటం చూసిన భర్త..
భవనం రెండు, మూడవ అంతస్తులలో 3 నుంచి 4 కుటుంబాలు నివసిస్తున్నాయని, మొదటి అంతస్తులో కార్మికులు పనిచేస్తున్నారని, అందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటివరకు ఒక రెండున్నరేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు వెలికితీశారని వారు చెప్పారు.
- Advertisement -